రైతులకు నాణ్యమైన కరెంటు:మంత్రి

తెలంగాణ లో రైతులకు ఎటువంటి కరెంటు కష్టాలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నార. రైతుల కరెంటు కష్టాలు ఇప్పటికే చాలా వరకు తీర్చమని ఇప్పుడు ఉన్న చిన్నచిన్న కష్టాలు కూడా ఇక ముందు లేకుండా చూస్తామని జగదీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని యాదగరిగుట్ట మండలం వంగపల్లిలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  నూతన విద్యత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి  విద్యుత్ సమస్యను అధికమించడంలో రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతులు ఆన్ ఆఫ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  కేసీఆర్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ ఆదుకుంటూన్నారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీత పాల్గొన్నారు.