రు.3.5కోట్లకు కుచ్చుటోపి పెట్టిన యువతులు

ఏయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టామంటూ ప్రచారం చేసుకుని దీని ద్వారా వ్యాపారం చేసి కోట్ల గడించవచ్చని ఒక వ్యక్తిని మోసం చేసిన ఇద్దరు కిలాడీ యూవతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని తమ వద్ద ఎయిడ్స్ కు మందు ఉందని సదరు మూలికల వైద్యం ద్వారా కోట్లను గడించవచ్చని తార్నాకకు చెందిన కేఎస్ సురేందర్ రెడ్డి ని పరిచయం చేసుకున్న ఇద్దరు యువతులు దఫాలుగా 3.5 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయించుకున్నారు. అప్పు తెచ్చి మరీ సురేందర్ రెడ్డి వారు సూచించిన బ్యాంకుల్లో డిపాజిట్ చేశాడు. తీరా మూలికలు లేకపోవడంతో వారు డబ్బును తిరిగి పంపుతామని చెప్పి నల్ల రంగు పూసిన కాగితాలను పంపడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సురేందర్ రెడ్డి అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సురేందర్ రెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.