రాహుల్ పై సెటైర్లు

నోట్ల రద్దు వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని తాను నోరు విప్పితే పార్లమెంటులో భూకంపం రావడం ఖాయమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దానికి సంబంధించి ఎటువంటి వివరాలు బయటపెట్టకపోవడం పై బీజేపీతో పాటుగా ఇతర పార్టీల నాయకులు కూడా రాహుల్ ను ఎద్దేవా చేస్తున్నారు. నోట్ల రద్ద వ్యవహారంలో మోడి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందారని దానికి సంబంధించి తన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయంటూ రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై బీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. రాహుల్ కు మతితప్పిందని ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారని బీజేపీ విమర్శించింది.

మరోవైపు ఎన్సీపీ కూడా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బయట పెట్టాలని డిమాండ్ చేసింది. ఆ పార్టీ నేత శరద్ పవార్ రాహుల్ గాంధీ పై సెటైర్లు వేస్తున్నారు. పార్లమెంటులో ఎక్కడ భూకంపం వస్తుందోనని సభ్యులు భయపడ్డారని ఇప్పుడు వారి ప్రశాంతంగా నిద్రపోతారని అన్నారు.

అటు రాహుల్ పై సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే అంశంపై అనేక జోకులు పేలుతున్నాయి. లలిత్ మోడీకి నరేంద్ర మోడీకి తేడా తిలయకుండా రాహుల్ వ్యవహరిస్తున్నాడని లలిత్ మోడి అవినీతిని నరేంద్ర మోడీదిగా పొరపడుతున్నారంటూ ప్రచారం సాగుతోంది.

నరేంద్ర మోడీ పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ తన దగ్గర ఉన్న ఆధారాలను వెంటనే బయట పెట్టాలని లేకుంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.