రాష్ట్రంలో 12కు చేరిన కరోనా మృతులు.

0
3

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

గురువారం ఒక్కరోజే 18 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, ఒకరు మృతి చెందారని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12కు చేరింది. ఇక 471 పాజిటివ్‌ కేసుల్లో 385 మంది మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు, వారిని కలిసిన వ్యక్తులు ఉన్నారని మంత్రి తెలిపారు.

ఇప్పటి వరకు 45 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న రోగులు ఏప్రిల్‌ 22వ తేదీ వరకు కోలుకునే అవకాశం ఉందన్నారు.

మర్కజ్‌ కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండేదన్నారు మంత్రి.

ఇక వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 60 నుంచి 70 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించడం వల్లే కరోనా కేసులు తగ్గాయన్నారు.

రేపట్నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

గురువారం ఒక్కరోజే 665 నమూనాలు పరీక్షిస్తే 18 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని ఈటల రాజేందర్ తెలిపారు

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here