రహదార్లపై మద్యం దుకాణాలు బంద్

మధ్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై సుప్రీం కోర్టు స్పధించింది. రహదారులపై మధ్యం సరఫరా ఉండానికి వీల్లేదని అభిప్రాయపడ్డ కోర్టు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుపై మధ్యం అమ్మలను ఆపేయాలని ఆదేశాలు జారీచేసింది. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. జాతీయ రహదారుల వెంబడి మధ్యం దుకాణాలను మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న దుకాణాలు తమ లైసెన్సు ఉన్నంతవరకు దుకాణాలు నడుపుకోవచ్చని మార్చి 2017 నుండి వీటి లైసెన్సులను పునరుద్దరించవద్దని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.

రహదారుల వెంట ఉన్న మధ్యానికి సంబంధించిన బ్యానర్లను కూడా వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తప్పతాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి ప్రమాదాలు తగ్గవని పేర్కొంటూ ముందుగా మధ్యం దుకాణాలను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది.