ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ కుర్థు యువతి తలకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ 6.5కోట్ల రూపాయల వెలకట్టింది. ఈ 23 సవంత్సరాల యువతిని చంపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (దాదాపు ఆరున్నర కోట్లు) ఆందచేస్తామని ఐఎస్ఐఎస్ ప్రకటన జారీ ఆయింది. డెన్మార్క్ కు చెందిన ఈ కుర్థు యువతి పళని ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా సిరియా,ఇరాక్ లలో పోరాడేందుకు కుర్థదళంలో చేరింది. ప్రస్తుతం ఆమె డెన్మార్క్ జైల్లో ఉంది. దేశం విడిచి వెళ్లి ఉగ్రవాద సంస్థలో పనిచేసినందుకు గాను డెన్మార్క్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్వదేశానికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం డెన్మార్క్ రాజధాని కోపేనె హేగన్ లోని జైల్లో ఉంది. అమేపై ఉన్న అభియోగాలు రుజువైతే రెండు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
కుర్థు దళాల్లో పనిచేసిన తరువాత డెన్మార్క్ కు వచ్చినప్పటి నుండి ఈ యువతికి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఐఎస్ఐఎస్ ఈ యువతి తలపై భారీ వెలకట్టింది. తనను పోలీసులు అరెస్టు చేయడాన్ని కుర్థు యువతి తప్పుబడుతోంది. డెన్మార్క్ ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతోందని ఈ పోరాటంలో డెన్మార్క్ సైనికులు పాల్గొంటున్న సమయంలో తాను కుర్థు దళాలతో కలిసి పనిచేస్తే తప్పెంటని పళని ప్రశ్నిస్తోంది. కుర్థులపై ఎస్ఐఐఎస్ చేస్తున్న అరాచకాలను భరించలేకే తాను కుర్థు దళం చేరారని ఆమె చెప్తున్నారు. ఇరాకీ నుండి మొదటి గల్ఫ్ యుద్ధ సమయంలో పళని కుటుంబం డెన్మార్క్ కి వలస వచ్చింది. డెన్మార్క్ కు చెందిన యువతిగా తాను నేర్చుకున్న విలువలు, మహిళా స్వేచ్ఛా హక్కుల కోసం పోరాడుతున్నట్టు పళని తన ఫేస్ బుక్ లో పేర్కొంది.