ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మొహాలీలో టెస్ట్ మ్యాచ్ ను భారత్ కౌవసం చేసుకుంది. దీనితో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో నిల్చింది. ఓవర్నైట్ స్కోరు 78/4తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 236 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం తరువాత భారత్ విజయ లక్ష్యం 103 పరుగులు కాగా భారత్ రెండు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత రెండో ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ 67 పరుగులు చేశాడు. 12 సంవత్సరాల తరువాత పటేల్ టెస్టుల్లో అర్థశతకాన్ని పూర్తి చేశాడు. పుజారా 25 పరుగులు చేశాడు.