మోడీని వ్యతిరేకించిన భర్తకు విడాకులు

ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే విడాకులిచ్చేస్తానని అంటోంది ఒక మహిళ. ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సదరు మహిళ సిద్ధమవుతోంది. ప్రధాని చేస్తున్న పనులకో తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన దేశ ప్రజల కోసం ఎంతో చేస్తున్నా ఆయన్ను విమర్శించడం దారుణమని అంటున్న సదరు మహిళ తన భర్త మోడీని విమర్శించడాన్ని తట్టుకోలేక పోతోంది. దీనితో భర్తకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోంది. అన్ని ఏటీఎంల దగ్గరికి వెళ్లి మోదీజీ డబ్బులు నింపాలా? మీ హక్కుల కోసం పోరాడండి.. మోదీ ఒక్కరే అందరి కోసం పోరాడుతున్నారు. సరిహద్దులోకి వెళ్లి శత్రువులతో పోరాడండి. దేశాన్ని రక్షించేందుకు సరిహద్దులో సైన్యం ఎంతగా కష్టపడుతున్నారో తెలుస్తుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నా భర్త విమర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అవసరమైతే మోదీజీ కోసం నేను ఆయనకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా’ ఉన్నానని రష్మీ జైన్‌ అనే మహిళ ప్రకటించడం సంచలనం సృష్టించింది.