మనసుండాలె కానీ మార్గాలు ఎన్నో ఉంటాయి…. ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా మహమ్మారి తో పోరాటాన్ని ప్రభుత్వాలు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు , పోలీసులు ఎంతో సమర్ధవంతము గ ఎదుర్కొంటున్నారు. వారి పోరాటానికి బలాన్ని ఇవ్వటానికి ఇప్పటికే అనేక మంది క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు తమవంతు సహాయాన్ని ప్రభుత్వానికి ధన వస్తు రూపేణా ఇచ్చారు. మరి కొందరు సామాన్యులు ఇతోధికంగ ఆహారము మరియు ఆహార వస్తువుల పంపిణీ చేస్తూ సహాయ కార్యక్రమాల లో పలు పంచు కుంటున్నారు.
ఇందులో భాగం గా సిరిసిల్లలో కాంతమ్మ అనే వృద్ధురాలు తన పించన్ 12 వేలు కరోన సహాయ నిధి కింద కలెక్టర్ కృష్ణ భాస్కర్ కి ఇచ్చి తన సహృదయాన్ని చాటుకున్నారు . ఆమె దాతృత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.