మెక్సికోలో భారీ పేలుడు 29 మంది మృతి

మెక్సికో లోని బాణా సంచా మార్కెట్ జరిగిన పేలుళ్లలో 29 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయాలయ్యాయి. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం ఏర్పాటు చేసిన బాణాసంచా మార్కెట్ లో ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లు జరిగిన సమయంలో మార్కెట్ మొత్తం జనాలతో కిటకిట లాడుతోంది. ఒక బాణా సంచా దుకాణంలో ఎగిన మంటలు క్రమంగా అన్ని దుకాణాలకు వ్యాపించాయి. పేలుళ్లతో ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. వరుస పేలుళ్లతో అన్ని దుకాణాలు తగలబడిపోయాయి. సమీపంలోని ఇళ్లు, వాహనాలకు కూడా నిప్పంటుకుంది. ఈ ప్రమాందంలో ఘటనా స్థలంలోనే 26 మంది మృత్యువాత పడగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 70మందికి పైగా దీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
meximexi1
ఒక్కసారిగా ఎగిసిన మంటల నుండి తప్పించుకోవడం అక్కడున్నవారికి సాధ్యం కాలేదు. వరుస పేలుళ్లతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సాధ్యం కాలేదు. దాదాపు మూడు గంటల తరువాత కానీ మండలు అదుపులోకి రాలేదు. పేలుళ్లకు గల పూర్తి కారణాలు వెలుగులోకి రాలేదు. ప్రమాదవశాత్తు మంటలు ఎగిసి పడ్డాయా లేక ఏదైనా ఉద్రోహ చర్య ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *