February 29, 2020

ముఖ్యమంత్రికీ 24వేలే…

సామాన్యులకే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కి కూడా బ్యాంకుల నుండి నగదు ఉపసంహరణ పరిధి నుండి మినహాయింపు లభించడం లేదు. దీనితో ప్రముఖులు కూడా నగదు రహిత లావాలేదీవలపై వేపు మళ్లుతున్నారు. తాను ఢిల్లీ వెల్లడానికి బ్యాంకు నుండి డబ్బులు తీసుకోవడానికి మేనేజర్ ను సంప్రదిస్తే 24వేల రూపాయలు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉందని చెప్పారని దానితో 24వేలతోనే ఢిల్లీకి పయనం అయినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ తనకు కూడా 24వేలే బ్యాంకు నుండి తీసుకునే అవకాశం వచ్చిందన్నారు. మరో వైపు కాంగ్రెస్ నేత జానారెడ్డి కేసీఆర్ పై చెణుకులు విసిరారు. పెద్ద నోట్ల రద్దును గురించి ముఖ్యమంత్రి పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోలోప మాత్రం బాధపడుతున్నారని అన్నారు. దీనితో సభలో నవ్వులు విరిశాయి.