ముంబాయి టెస్టులో భారత్ భారీ విజయం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టుమ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది.  ముంబాయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 186 పరుగులకు ఆరువికెట్ల ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 195 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగు వికెట్లను కేవలం 13 పరుగులకు కోల్పోయింది. ఈ నాలుగు వికెట్లు అశ్విన్ ఖాతాలో పడ్డాయి. టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 400 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 631 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ ఇంగ్లాండ్ ను 195 పరుగులకే కట్టడి చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది.