మిస్ సుప్రాగా ఎంపికైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

’మిస్‌ సుప్రా నేషనల్‌–2016’ కిరీటాన్ని  బెంగళూరుకు చెందిన అందాల భామ శ్రీనిధి రమేష్‌ శెట్టి కైవసం చేసుకుంది.  శ్రీనిధి బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం మంగళూరులో సాగింది. బెంగళూరులోని భగవాన్‌ మహావీర్‌ జైన్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ను చదివారు. బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థలో రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా  పనిచేశారు. పోలెండ్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన భామలను వెనక్కునెట్టి ఈ అందాలరాశి కిరీటాన్ని అందుకుంది.