మిస్ వరల్డ్ స్టేఫానీ…

మిస్ వరల్డ్ గా ఎంపికైన ప్యూటరీకో భామ స్టేఫానీ డెల్ వాలే ఆంనందంతో మాటలు రావడం లేదంటోంది. తనకు మద్దతుగా నిల్చిన అభిమానులకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. అమెరికా రాజధాని వాషింగ్ టన్ కు సమీపంలోని నేషనల్ హార్బర్ లో అట్టహాసంగా జరిగిన పోటీల్లో ప్యూటరీకో అనే చిన్న దేశానికి చెందిన 19 సంవత్సరాల అందాల భామ స్టేఫానీ మిస్ వరల్డ్ గా ఎంపికైంది. డొమికన్ రిపబ్లిక్ కు చెందిన మిగ్వైలినా నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ స్టేఫానాకే అందాల కిరీటం దక్కింది. గిల్వైలినా ఫస్ట్ రన్నరప్ గానే గిలిలిపోయింది. సెకండ్ రన్నరప్ గా  ఇండోనేషియా కు చెందిన మాన్యూయెలా నిల్చింది. దాదాపు 100 దేశాల నుండి అందాల భామలు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడ్డారు. గత ఏడాది మిస్ వరల్డ్ గా ఎంపికైన మిరేయా లలగుణ నుండి స్పేఫాని కిరీటాన్ని అందుకుంది.