మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ ర్యాలీలు

హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో మహ్మద్ ప్రవస్త జన్మదినం మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగను పురస్కరించుకుని మసీదులను అందంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పాత నగరంలో ఎక్కడ చూసినా విద్యుత్ దిపాల అంలకరణలతో మసీదులు కళకళలాడుతున్నాయి. ప్రత్యేక తోరణాలను కట్టి మసీదులను సుందరంగా అలంకరించారు. పాతబస్తీతో పాటుగా అనేక ప్రాంతాల్లో ముస్లీం యువకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి.

మిలాద్-ఉన్-నబి సందర్భంగా ఎంఐఎం ప్రధాన కార్యలయం దారుల్ షిఫా లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లీం మదపెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని సమావేశంలో పాల్గొన్న మతపెద్దలు సూచించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అసుదద్దీన్ ఓవైసీ ర్యాలీ సందర్భంగా ముస్లీం యువకులు క్షమశిక్షణతో మెలగాలని సూచించారు. మత పరమైన ఉద్రిక్తతలు సృష్టించే ఎటువంటి నినాదాలు చేయవద్దని అన్నారు.