మరోసారి పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం

0
2

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరోసారి సత్తా చాటింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మరోసారి  ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ-సీ36 వాహన నౌక ద్వారా రిసోర్స్ శాట్-2ఎ  అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. రిసోర్స్ శాట్-2 ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో రిసోర్స్ శాట్-2ఎ ను ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. దీని ద్వారా రక్షణ రంగంతో పాటుగా జనవనరులు, పట్టణ ప్రణాళిక, వ్యవసాయ రంగాల సేవలకు ఉపయోగించనున్నారు. ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రయోగం సఫలం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాల్పంచుకున్న ప్రతీ ఒక్కరినీ ఆయన అభినందించారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here