మరోసారి కల్తీ కల్లు కలకలం

కల్తీ కల్లు మరోసారి పంచా విసిరింది. కల్తి కల్లు తాగి 23 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన రాజన్ని జిల్లా వీర్నపల్లి మండంలం మద్దిమల్ల గ్రామంలో జరగింది.స్థానికుల కథనం ప్రకారం స్థానికంగా గ్రామంలోని ఒక కల్లుదుకాణంలో కల్లు సేవించిన వారిలో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కల్లు తాగిన తరువాత కొద్దిసేపటికే కొందరి కాళ్లూ చేతులు ఆడకపోవడం,వికారం,తలతిరిగుడుతో కుప్పకూలిపోయారు. కొంత మంది మాత్రం కొద్ది దూరం వెళ్లిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వీరందరినీ ఎల్లారెడ్డిపెట మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కల్తీ ఘటనకు సంబంధించి ఏక్సైజ్ శాఖ అధికారులు కల్లు శాంపిల్స్ ను తీసుకుని వెళ్లారు. కల్లు కల్తీ కావడానికి కారణాలు తెలియలేదు.