మరోసారి ఆస్పత్రిలో చేరిన కరుణానిధి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కావేరీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇటీవలే ఆసుపత్రి నుండి కరుణానిధి ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చారు. మళ్లీ ఆయన అస్వస్థతకు గురికావడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.

గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. గత 15 రోజుల్లో కరుణానిధి రెండవ సారి అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చేరారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.