మబ్బుల పలకరింత-నగరవాసి తుళ్లింత

హైదరాబాద్ లో వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. చల్ల గాలులకు తోడు నగరమంతా మబ్బుపట్టి ఉండడంతో నగరవాసులతో మేఘాలు దోబుచులాడుతున్నాయి. నగరం మొత్తం మంచు దుప్పటి కప్పుకుని ఉంది. మేఘాలతో పాటుగా మబ్బుల పలకరింతలతో నగర వాసులు పులకరిస్తున్నారు. ఉదయం నుండి ఆహ్లాదకరమైన వాతారవరణాన్ని హైదరాబాద్ వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. రోజుటికన్నా పెద్ద సంఖ్యలో ఉదయమే పార్కుల్లో జనసంచారం పెరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్యాంగ్ బండ్ పై విహరిస్తున్న వారు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ తో పాటుగా నగరంలోని పార్కుల్లో రోజుటికన్నా సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది.

తుపాను తీరం దాటిన తరువాత హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. వర్షంతో పాటుగా చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.