మన రాతను మార్చే భగవద్గీత

0
81

చదువుకోలేని వారికి సైతం భగవద్గీతను అందుబాటులోకి తీసుకుని రావడం ఆనందకరమని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రముఖ నేపధ్య గాయకలు గంగాధర శాస్త్రి నెలకొల్పి 10 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి బంజారాహిల్స్ లోని ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత మన మనుగడుకు దిక్సూచీ లాంటిదన్నారు. మానవులు ఎదుర్కొనీ ప్రతీ సమస్యకు పరిష్కారం గీత లభిస్తుందన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్ శ్రీమతి గీతా మూర్తి మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం ప్రపంచ దేశాలకే తలమానికం అన్నారు. ప్రముఖ టీవీ నటులు చలపతి రాజు ,భగవద్గీత ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Wanna Share it with loved ones?