మంగళయాన్ కన్నా మోడీ ప్రచారపు ఖర్చే ఎక్కువ

టెలివిజన్,సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించుకోవడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ముందే ఉంటారు. గత ఎన్నికల్లో బీజేపీ భారీ విజయానికి నరేంద్ర మోడీ ఛరిష్మాతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా జరిగిన ప్రచారం కూడా ప్రధాన కారణమనే భావనలున్నాయి. ఎన్నికలకు ముందు మోడీ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించారనే ఆరోపణలున్నాయి. ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో కేవలం టెలివిజన్, ఇటర్నెట్, ఇతర ఎలక్ర్టానిక్ మాధ్యమాల్లో ప్రచారానికి రు.11 వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ఇది విపక్షాల ఆరోపణలు కావు కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచరం.

  • ఇక పత్రికల యాడ్స్‌కు, హోర్డింగ్‌లకు, బుక్‌లెట్స్‌కు, క్యాలెండర్లకు ఖర్చు పెట్టిన మొత్తాలను ఇందులో పరిగణలోకి తీసుకోలేదు. వాటిని కూడా లెక్కిస్తే ఇది మరింత ఎక్కువ పెరిగడం ఖాయం.
  • రఘువీర్ సింగ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానాంగా  కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ వివరాలను అందజేసింది.
  • 2014, జూన్ 1వ తేదీ నుంచి 2016, ఆగస్టు 31వ తేదీ వరకు మోదీతో తీసిన ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ప్రచారానికి 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
  • ప్రతిష్టాత్మక మంగళయాన్ కన్నా మోడీ ప్రచారపు ఖర్చే ఎక్కువ.