భారత్ 451/7

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో తాను సాధించిన శతకం ఎంతో ప్రత్యేకమైనదని టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. మూడోరోజు ఆట నిలిపివేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు ఇన్నింగ్స్ ల్లో తాను పూర్తిగా విఫలం కావడంతో తనపై ఎంతో ఒత్తిడి పెరిగిందన్నాడు. దీంతో సరైన సమయంలో తన బ్యాట్ నుంచి పరుగులు రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నాడు.