భారత్ లోని ప్రముఖుల డేటా చోరీ…

భారత్ కు చెందిన 40వేలకు పైగా సర్వర్లను హ్యాక్ చేసినట్టు ప్రముఖ హ్యాకింగ్ సంస్థ లీజియస్ గ్రూపు చేసిన ప్రకటన తో సంచలనాన్ని కలిగిస్తోంది. భారత్ కు చెందిన నలభై వేల సర్వర్లను హ్యాక్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున డేటాను సేకరించినట్టు ఈ సంస్థ ప్రకటించిది.

1. భారత్ లోని అత్యంత ప్రముఖుల డేటాను హ్యాక్ చేసినట్టు ప్రకటించిన లీజియస్ గ్రూప్

2.40 వేల సర్వర్ల ద్వారా అత్యంత కీలకమైన డేటాను దొంగిలించిన సంస్థ

3. తమ దగ్గర ఉన్న వివరాలు వెల్లడిస్తే భారత్  ప్రకంపనలు ఖాయమని చెప్పిన లీజియస్

4. అపోలో తో పాటుగా పలు కీలక సర్వర్లను హ్యాక్ చేశామని వెల్లడించిన లీజియస్

5. రాహుల్ గాంధీ, విజయ్ మాల్యాలతో పాటుగా  జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్‌ కుమార్‌ వంటి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసింది ఈ సంస్థే.

6. అపోలో ఆస్పత్రి సర్వర్లను హ్యాక్ చేశామని ఇది బయటపడితే భారత్ లో కల్లోలం ఖాయం అంటూ చేసిన ప్రకటనపై సర్వత్రా ఆశక్తి

7. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందింది అపోలో ఆస్పత్రిలోనే.

8. వాషింగ్ టన్ పోస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంస్థ ప్రతినిధులు