నేపాల్ సరిహద్దుల ద్వారా కరోనా పాజిటివ్ ఉగ్రవాదుల ప్రవేశానికి పాకిస్థాన్ పన్నాగం పన్నింది. ఈ కుట్రను బయటపెట్టిన సశస్త్ర సీమా బల్ (SSB) బలగాలు అప్రమత్తం అయ్యాయి. కుట్రకు సూత్రధారిగా జాలిమ్ ముఖియాగా నిఘా వర్గాలు గుర్తించాయి.
నేపాల్‌లోని ఖైర్వా జిల్లాలో సరిహద్దు గ్రామంలోని మసీదులో 200 మంది దాగినట్టు సశస్త్ర సీమా బల్ (SSB) బలగాలు గుర్తించాయి. వారంతా ఇస్లామిక్ దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన భారతీయులని వెల్లదించారు.
వివరాలను ఎస్.ఎస్.బీ. అధికారులు, బిహార్ పోలీసు యంత్రాంగానికి అందజేసినది. స్క్రీనింగ్ సమయంలో పారాసిటమాల్ ఇచ్చి సరిహద్దు దాటించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నింది. తద్వారా స్క్రీనింగ్‌లో శరీర ఉష్ణోగ్రతపై అనుమానం రాకుండా జాగ్రత్తలు పడింది. బిహార్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది.