బ్యాంకు యూనియన్ల సమ్మె బాట

ఒక పక్క పెద్ద నోట్ల రద్దు దేశంలో నగదు లభ్యం కాకా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. బ్యాంకు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో బ్యాంకు యూనియన్లు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈనెల 28న ప్రదర్శనలు, జనవరి 2,3వ తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని బ్యాంకు యూనియన్లు నిర్ణయించాయి.
నోట్ల రద్దు వల్ల బ్యాంకు ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చిందని దానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్ తో పాటుగా బ్యాంకుల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కొంత మంది బడా వ్యక్తులకు కోట్లాది రూపాయల కొత్త నోట్లు ఎట్లా వచ్చాయి అనే అంశంపై సీబీఐ విచారణ జరపాలని బ్యాంకు యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులకు సరిపడా నగదు పంపని కారణంగా బ్యాంకుల కార్యకలాపాలు నిల్చిపోతున్నాయని బ్యాంకులకు సరిపడా నగదును పంపాలని యూనియన్ లు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైన మార్పులను సత్వరం చేయించి ఏటీఎంలను వెంటనే అందుబాటులోకి తీసుకుని రావాలని బ్యాంకు యూనియన్ లు కోరుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకులకు తక్కువ నగదును సరఫాచేస్తూ అదే సమయంలో ప్రైవేటు బ్యాంకులకు ఎక్కువ నగదు సరఫరా చేస్తున్నారని దీని వల్ల ప్రభుత్వ బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయే విధంగా ఆర్బీఐ వ్యవహరిస్తోందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందిచాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *