బ్యాంకులకు సెలవులు, తెరుచుకోని ఏటీఎంలు

ఒక వైపు బ్యాంకులకు వరుస సెలవులు మరో వైపు పనిచేయని ఏటీఎంలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకులకు వరుసగా మూడురోజుల పాటుగా సెలవులు రావడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలు ఎప్పటికి తేరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది . ఏటీఎంలలో డబ్బులు వేసిన కొద్ది సేపటికే వాటిలో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. చాలా ఏటీఎంలు ఇప్పవరకు అసలు పనే చేయడం లేదు. యాతావాతా 70 శాతం ఏటీఎంలు పనికి రాకుండా పోయాయి.

ఏటీఎంలు పనిచేయకపోవడం, బ్యాంకులు తెరుచుకోకపోవడం తో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం, చిన్న వ్యాపారుల పరిస్థితి దారుణంగా తయారైంది. నెలరోజుల పాటు ఎదో విధంగా నెట్టుకుని వచ్చిన ప్రజలు ప్రస్తుతం తమ ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోవడం బ్యాంకుల నుండి డబ్బులు తీసుకునే అవకాశాలు లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు అంతే లేకుండా పోతోంది.

నగదు రహిత లావాదేవీలు క్రమంగా పెరిగినప్పటికీ వీటి సంఖ్య 30 శాతానికి దాటడం లేదు. దాదాపు 70శాతం కార్యకలాపాలు పూర్తిగా స్థబించిపోయాయి. దీనితో ఏం చేయాలో పలుపోని స్థితిలో సామాన్యుడు అల్లాడుతున్నాడు.