బీజేపీ పై పవన్ కళ్యాణ్ విమర్శలు

బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు 2014 ఎన్నికలకు ముందు ప్రకటించి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీ పై విమర్శల దాడికి దిగారు. ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ బీజేపీపై ప్రశ్నలను సంధించారు. గోవధ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వంటి అంశాలపై తాను మేధావుల అభిప్రాయాలు సేకరించానని వీటిపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నింస్తున్నట్టు చెప్పారు. గోరక్షణ అంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ వైఖరిని విమర్శించారు. బీజేపీ నేతలు ఆవులను ఎందుకు దత్తత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. లెదర్ బెల్టులను, చెప్పులను బీజేపీ నేతలు ఎందుకు ధరిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు గోవధను నిషేదించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ట్విట్లు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి.