ఎస్పీ బాలసుభ్రణ్యం మరణం భారతీయ సినీ సంగాతానికి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. దిల్ షుఖ్ నగర్ పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలు సంస్మరణ సభను సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షుడు లంకా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 40వేలకు పైగా పాటులు పాడిన బాలు మన తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిస్టలు సాధించినప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకు మాత్రమే చెల్లిందన్నారు.
ఏ హీరోకు పాటలు పాడిన ఆయా హీరోలు పాడినట్టుగా అనిపించేత గొప్పగా పాడేవారని అటువంటి అరుదైన గాయకుడు మళ్లీ పుట్టడని సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి ఏస్.వి.రాధాకృష్ణ అన్నారు.
ఎస్పీ బాలసుభ్రమణ్యం మన మధ్య బౌతికంగా లేకపోయినా ఆయన పాటిన పాటల్లో ఆయన సగీవంగా ఉంటారని నాగరాజు చెప్పారు.
వేలాది పాటలకు జీవంపోసిన ఎస్పీ బాలసుభ్రమణ్యం గొప్పగాయకుడే కాదు అంతకుమించిన మానవతావాదని పున్నా శ్రీనివాసులు అన్నారు. ఎంతో మంది జౌత్సాహిక గాయకులను ప్రోత్సహించిన ఘనత ఆయన సొంతమంని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశ్, కరాటే శీను, బిట్టు, సుభ్రమణ్యం, సందీప్ తదితరులు పాల్గొన్నారు.