కంటైన్ మెంట్ జోన్ గా బాలాపూర్ ను ప్రకటించిడంతో బాలాపూర్ లోని షహీన్ నగర్ , హలీం నగర్ , వాదేహి జుబేద్ వెళ్లే రహదారులను పోలీసులు మూసి వేసారు. కోవిడ్ నియంత్రణ ప్రదేశం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పూర్తిగా వాహనాల రాకపోకలు బంద్ చేశారు. నిత్యావసర సరుకులు కూడా ఇళ్ల వద్దకే అందిస్తామని అధికారులు తెలిపారు. క్లస్టర్ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ సిపి కోరారు.