బంద్ కాదు నిరసన మాత్రమే అంటున్న కాంగ్రెస్

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తమ పార్టీ బంద్ కు పిలపునివ్వలేదని కేవలం నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇతర పార్టీలు బంద్ కు పిలపునిచ్చినా తమ పార్టీ మాత్రం కేవలం నిరసన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప బంద్ లో పాల్గొనడం లేదని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతోందని కాంగ్రెస్ బంద్ జరుపుతోందంటూ అబద్దపు ప్రచారానికి పూనుకుంటోందని రమేష్ అన్నారు.