February 29, 2020

బంగారం పై స్పష్టత ఇచ్చిన కేంద్రం

బంగారం పై పన్ను విధిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంట్లో ఉన్న బంగారానికి సంబంధించి ఐటి శాఖకు లెక్కలు చెప్పాలని లేని పక్షంలో బంగారంపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధిస్తోందంటూ జరుగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. బంగారంపై జరుగుతున్న ప్రచారంతో ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై స్పష్టత ఇచ్చింది. నగదు మార్పడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను ఉంటుందని కేంద్ర మంత్రి ఆరుణ్ జైట్లీ చెప్పారు. వివాహితులు 500 గ్రాములు, పెళ్లికాని ఆడపిల్లలు 250 గ్రాములు పురుషులు 100 గ్రాములు బంగారాన్ని కలిగి ఉండవచ్చని అరుణ్ జైట్లి చెప్పారు. వారసత్వంగా వచ్చిన బంగారంతో పాటుగా లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.