ప్రాణాలు తీస్తున్న రేసింగ్ లు

హైదరాబాద్ లో జరుగుతున్న రేసింగ్ లను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రేసింగ్ లు  మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా వారాంతాల్లో రోడ్లమీద దీసుకుపోతున్న బైక్ లు, కార్లతో పాదచారులతో పాటుగా రేసర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు పై రేసింగ్ లు ఎక్కువ కావడంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. దీనితో అవుటర్ పై తగ్గిన రేసింగ్ లు నగరం నడిబొడ్డుకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లాంటి ప్రాంతాల్లో రేసింగ్ లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి . తాజాగా  బంజారాహిల్స్ లో ఆదివారం తెల్లవారుజామున డ్రాగ్ రేసు సందర్భంగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ రేసర్ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, రేసర్ నదీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్ధితి విషమంగా ఉంది.