ప్రభావశీలి-ప్రతిభా మూర్తి

పి.వి.నరసింహారావు భారత రాజకీయాలపై తనదైన ముద్రను వేసిన అతికొద్ద మంది నేతల్లో ఒకరు. భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని ముద్రించుకున్న అపార మేధావి, బహుబాషా కోవిదుడు, రాజకీయ వేత్త, ఆర్థిక సంస్థరణలకు నాంది పలికిన దేశ నేత పీ.వీ.నరసింహావు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి ఒడుదొడుకులు లేని విధంగా నడిపినా… కాంగ్రెస్ పార్టీలోని మహామహ నేతలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినా ఆయనకే చెల్లింది. గొప్ప గొప్ప పేరున్న కాంగ్రెస్ నేతలు కూడా పీవీ హయాంలో కనుమరుగయ్యారు.
అపర చాణిక్యుడిగా పేరుపొందిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన రాజనీతిజ్ఞుడు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పీవీ హయాంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు దేశ దశ, దిశను మార్చాయి. విదేశాల్లో దేశ బంగారాన్ని తాకట్టుపెట్టుకునే దుస్థితిని నుండి విదేశీ మారక ద్రవ్యం మిగులు సాధించగలిగే లాగా దేశాన్ని ముందుకు నడిపించిన ప్రధాని పీవీ నరిసంహారావు.

  • ఆర్థిక సంస్కరణలకు నాంది పీవీ హయాంలోనే పడింది
  • ఐదు సంవత్సరాల పాటుగా మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధానిగా పేరు పొందిన పీవీ
  • ప్రధాని పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడు
  • ఐదు సంవత్సరాల పాటు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగిన మొట్టమొదటి నెహ్రు కుటుంబేతరుడు
  • భారత విదేశీ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన ప్రధాని
  • రెండో అణు పరీక్షలకు రంగం సిద్ధం చేసిన వ్యక్తి
  • రక్షణ రంగంలో ఇజ్రయిల్ లాంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న దూరదృష్టి గల నేత
  • హర్షద్ మెహతా కేసుతో పాటుగా పలు ముడుపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
  • బాబ్రీ మసీదును కాపాడడంలో విఫలం అయ్యారంటూ విమర్శలు
  • మైనార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలను చీల్చారని, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు.                                                                     (పీవీ నరసింహారావు వర్థింతి సందర్భంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *