ప్రతీకారం తీర్చుకున్న సింధూ

రియో ఒలింపిక్స్ లో తన పసిడి ఆశలకు గండికొట్టిన కరోలినా మారిన్ పై  పి.వి.సింధూ ప్రతీకారం తీర్చుకుంది. దుబాయ్ లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ టోర్నీ క్వాటర్ ఫైనల్స్ లో సింధూ మారిన్ పై 21-17,21-13తేడాతో విజయం సాధించింది. రియో ఒలింపిక్స్ లో సింధును ఓడించిన స్పేయిన్ క్రీడాకారిణి ఇప్పుడు సింధు చేతిలో ఓటిమి పాలైంది. మారిన్ ను ఓడించడం ద్వారా సింధు ఈ టోర్ని సెమీస్ లోకి దూసుకుని పోయింది. సెమీస్ లో ఆమె కొరియా క్రీడాకారిణి సంగ్ జిహ్యూన్ తో పోటీపడుతుంది.

రియో ఓటమికి ఇది ప్రతీకారం కాదని ఆటలో గెలుపు ఓటములు సహజం అని సింధు అంటోంది. అయితే రియో ఓటమి తరువాత వీలైనంత తర్వరగా మారిన్ తో ఆడాలని మాత్రం కోరుకున్నట్టు చెప్పింది. మారిన్ ను ఓడించడం ద్వారా తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని సింధూ అంటోంది. మారిన్ చాలా మంచి క్రీడాకారిణి అని సింధు అంటోంది.