ప్రణబ్ ఆశ్వీర్వాదం తీసుకున్న కేసీఆర్

దక్షిణాది పర్యటన కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాభివందనం చేశారు. గతంలోనూ పలుమార్లు ప్రణబ్ ముఖర్జీ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్ ఈ సారి కూడా ప్రణబ్ కు ప్రణమిల్లారు. బహిరంగ ప్రదేశాల్లో అయినా సరే తన కన్నా పెద్ద వ్యక్తులు గురు తువ్యులుగా భావించే వారి పాదాలు తాకి ఆశీర్వచనం తీసుకునే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు చదువు చెప్పిన గురువుకు ముఖ్యమంత్రి హోదాలో కాళ్లకు నమస్కారం పెట్టి అందరనీ ఆశ్చర్యపర్చారు. పలు సార్లు గవర్నర్ నరసింహన్ దంపతుల ఆశీర్వారం తీసుకున్న కేసీఆర్ గురువుుల పాదాలు తాగడంలో ఎటువంటి సంకోచాలు పెట్టుకోరని ఆయన సన్నిహితులు చెప్తారు.