ప్రజ్ఞాశాలి-చైతన్యశీలి

      ఒక తత్వవేత్త, ఒక బహుభాషాకోవిదుడూ, ఒక గొప్ప ఆర్ధికవేత్త , మహారాజనీతిఙ్ఞుడు, స్వాతంత్ర్య సమరయోధుడూ పీ.వీ. నరిసింహా రావు గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. అసలు భారత ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే పివి నరసింహారావు ముందు, పివి నరసింహారావు తరువాత అని చెప్తారు ప్రపంచ ఆర్ధిక నిపుణులు.“రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం ఉండదు” అని ఒక సందర్భంలో ఈయన చెప్పిన సమాధానం ఇప్పటికీ పతాక శీర్షికలను అంటుతూ ఉంటుంది.
 ఈయన భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు.
     1991:- మోయలేనన్ని అప్పుల భారంతో దేశ ఖజానా దివాళా తీయడానికి సిధ్ధంగా ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి ప్రపంచం నివ్వెరపోయేంతగా సంస్కరణలను ప్రవేశపెట్టి “పడి లేచిన కెరటం” అని ఆర్ధిక రంగంలో విమర్శకులచే ప్రశంశలు అందుకున్న మేటి నగధీరుడు. ఈయన చేసిన సంస్కరణల కారణంగా దేశీయ బాంకులు ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండీ భారతీయ రిజర్వ్ బాంక్ నియంతృత్వంలోకి తెచ్చారు. ఇలా తేవడం వల్ల 1992 లోనే కాదు…ఈయన పోయాకా కుడా 2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం భారతీయ బాంకులకు అంటకుండా కాపాడుకోగలిగాం!
     1991 వరకూ ఫారెన్ పాలసీ అంటే అమెరికా, బ్రిటన్ వగైరా దేశాల పెత్తనానికి వంతపాడడమే…” మనం విలువనిచ్చే చోట కన్నా మనకి విలువ ఉండే చోటు మనకి శ్రేయస్కరం” అని చెప్పి “LOOK EAST POLICY” అని భారతదేశానికి పరిచయం చేసిన గొప్ప రాజనీతిఙ్ఞుడు. దీనివల్ల మన సంస్కృతికి దగ్గరగా ఉండే ఇండోనేషియా, జపాన్ , తైవాన్ , మయన్మార్ లాంటి చిన్న చిన్న దేశాలతో వాణిజ్యం అన్ని రకాలుగా లాభించి భారతదేశాన్ని నాయకదేశంగా ఆసియా ఖండంలో నిల్చునేట్టు చేసింది. గొప్ప విద్యావేత్త ఐన పివి నరసింహారావుగారు 16 భాషలలో పండితుడు. కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారి “వేయి పడగలు” ని హిందీ లోకి అనువదించారు ఈయన.
     రెండవ సారి ఫోఖ్రాన్ అణు పరీక్షలకు బాటలు వేసింది కూడా పీవీ హయాంలోనే అంటారు. దాదాపుగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత పీవీ నరసింహా రావు పదవీకాలం అయిపోయింది. ఆ తరువాత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాజ్ పేయి మిగతా లాంఛనాలు పూర్తి చేశారు.
(పి.వి.నరసింహారావు వర్థింతిని పురస్కరించుకుని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *