ప్రజాసంఘాల పై దాడులు దారుణం

తెలంగాణ ఉధ్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాలను అవసరం తీరిన తరువాత టీఆర్ఎస్ సర్కారు అణచివేసే ప్రయత్నం చేస్తోందని పలువురు ప్రజాసంఘాల నేతలు, పాత్రికేయులు ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  ప్రజా కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీజ్ చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) కార్యా లయాన్ని తెరిపించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు ,మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య,సీనియర్ సంపాదకుడు శ్రీనివాస్ ,విమలక్క,. పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య , సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్దన్, సీపీఐ నేత కందిమల్ల ప్రతాప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ కాసీం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ లోక్‌సత్తా నాయ కుడు మన్నారం నాగరాజు  తదితరులు ప్రసంగించారు. ప్రజాసంఘాలు లేని తెలంగాణ ఉధ్యమాన్ని ఊహించగలమా అని వారు ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజా ఉధ్యమాలను అణచివేయాలనుకోవడం సమంజసం కాదని, ప్రజా ఉధ్యమాలను ఎవరూ అణచివేయలేరని వారు పేర్కొన్నారు. ప్రజా సంఘాల పై దాడులు దారుణమన్నారు. కవులు, కళాకారులు, రచయితల జోలికి వెళితే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు.