అమ్మ అంత్యక్రియలు పూర్తి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలోని మెరినా బీచ్ లో ఎంజేఅర్ సమాధికి ఇరవై అడుగుల దూరంలో జయలలిత పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. హింధూ సంప్రదాయాల ప్రకారం జయలలిత అంత్యక్రియలు జరిగాయి. జయలలిత కు అత్యంత అప్తురాలు శశికళతో పాటుగా జయలలిత మేనల్లుడు దీపక్  అంత్యక్రియల ప్రక్రియను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వపు అధికార లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు జయలలిత అంతిమ యాత్ర రారాజీ హాల్ నుండి మెరినా బీచ్ వరకు సాగింది. దారిపొడవునా జనం అమ్మను ఆఖరిసారిగాచూసేందుకు బారులు తీరారు. దీనితో చెన్నై రోడ్లు జన సంద్రంగా మారాయి. జయలలిత బౌతిక కాయాన్ని ఉంచిన రాజాజీ హాల్ కు దేశంలోని ప్రముఖులంతా క్యూ కట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ విద్యాసాగర్ లతో  పాటుగా కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, నాయిని నర్సింహ్మారెడ్డి తో పాటుగా రాజకీయ సినీ  ప్రముఖులు జయలలితకు శ్రద్దాంజలి ఘటించారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ తో సహా తమిళ సినీ పరిశ్రమ మొత్తం తరలివచ్చింది. తమ  ప్రియతన నాయకురాలిని కడసారిగా చూసేందుకు అమ్మ అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. దీనితో చెన్నై జన సంద్రాన్ని తలపించింది.