పార్టీ ఇంఛార్జ్ పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు

0
57

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పీసీసీ ఇన్ చార్జ్ కుంతియా పై పార్లమెంటు మాజీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కుంతియా శనిలా దాపురించాడని ఈ విషయాన్ని ఆయన మొహం మీదే చెప్పానంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో పనిచేసే వాళ్లను వదిలిపెట్టి బ్రోకర్లకు చోటు కల్పిస్తున్నారంటూ దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి టీఆర్ఎస్ ఘనత కన్నా కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది తీసుకున్న నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. ప్రజలతో సంబంధాలు లేని వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్లే పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు.
ప్రజలతో సంబంధాలు లేకుండా గాంధీ భవన్ లో పైరవీలు చేసుకునే వారిని, కోవర్టులను దూరం పెడితే పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని పోతున్నట్టు ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. సీనియర్ నేత వీ.హనుమంతరావుతో సహా పలువురు నేతలు వీటిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Wanna Share it with loved ones?