పార్టీలకూ అవే నిబంధనలు

0
58

రద్దయిన నోట్ల వ్యవహారంలో రాజకీయ పార్టీలకు ఎటువంటి ప్రత్యేక మినహాయింపు లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉందని దీని ద్వారా పెద్ద ఎత్తున నల్ల ధనాన్ని మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు తమ వద్ద ఉన్న నోట్లను ఈనెల 30వ తేదీ లోపుగా బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుందని పార్టీలకు ప్రత్యేకమైన మినహాయింపులు ఏవీ లేవని ఆర్థిక శాఖ తెలిపింది.
రద్దయిన నోట్లను విరాళంగా స్వీకరించడం నేరమని ఆటువంటి నోట్లను విరాళంగా తీసుకున్న రాజకీయ పార్టీలపై చర్యలు ఉంటాని ఆర్థిక శాఖ వెళ్లడించింది. సాధరణ పౌరులకు సంబంధించిన నిబంధనలే పార్టీలకు కూడా వర్తిస్తాయని వాటికి ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు లేవని చెప్పింది. పార్టీలకు ఇరవై వేల లోపు విరాళాలు అందచేసే వారి వివరాలను మాత్రం వెళ్లడించాల్సిన అవసరం లేదు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here