పార్కింగ్ స్థలం ఉంటేనే కార్ల అమ్మకం

మీ ఇంట్లో కారు పార్కింగ్ కు స్థలం ఉంటేనే ఇక నుండి మీరు కారు కొనే అవకాశం ఉంటుంది. పార్కింగ్ స్థలం లేకపోతే కారు అమ్మరు. ఇట్లాంటి నిబంధనను తీసుకుని వచ్చే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. పెద్ద ఎత్తున కార్ల కొనుగోలు పెరగడం పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాటిని ఇంటి ముందు పార్క్ చేస్తుండడంతో సమస్యలు వస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే చాలా వరకు కార్ల అమ్మకాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం ఉన్న కార్లలో దాదాపు 60 శాతానికి పైగా కార్లు రోడ్ల మీదనే పార్క్ చేసి కనిపిస్తాయి. ఈ క్రమంలో కార్ల అమ్మకాలు చాలా వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కార్ల కొనే స్థోమత ఉన్నప్పటికీ కార్లను నిలిపేందుకు పార్కింగ్ ఉన్న ఇళ్లు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువే.
    పార్కింగ్ స్థలం ఉంటేనే కార్లను అమ్మె విధంగా చట్టంలో మార్పులు తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ విషాన్ని రవాణా శాఖ చూస్తుండగా, పార్కింగ్ విషయాన్ని మునిసిపల్ శాఖ చూస్తోంది. దానివల్ల ఈ రెండు శాఖల మధ్య సమన్వయం సాధించి ఆ తర్వాతే ఈ నిబంధన అమలు చేయాలనుకుంటున్నారు. పైగా, దాంతోపాటు.. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచిన తర్వాతే దీన్ని కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుంది. ప్రజా రవాణా మెరుగ్గా ఉన్న చోట్ల సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇరుకు రోడ్లు, కారు నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ప్రభుత్వం సొంత వాహనాలను నిరుత్సాహపర్చడం వంటి చర్యల వల్ల ఇప్పటికే జపాన్ రాజధాని టోక్యో, సింగపూర్, హాంగ్ కాంగ్, బీజింగ్ వంటి ప్రాంతాల్లో సొంత కార్ల సంఖ్య తగ్గింది. అయితే ఆ మేరకు ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *