పాపం రాహుల్

పాపం రాహుల్ గాంధీ… ఒక పక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని భావి భారత ప్రధాని గా ప్రచారం చేస్తుంటే నెటిజన్లు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ మీద వచ్చినన్ని జోకులు మరే నాయకుడి మీద కూడా రాలేదు. రాహుల్ గాంధీని ఒక ముద్దపప్పుగా ప్రచారం చేస్తూ రాహుల్ పై రోజుకో రకమైన జోకులు ప్రచారం లోకి వస్తున్నాయి. దీనికి తోడు రాహుల్ గాంధీ కి చెందిన ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ కావడం అందులో అత్యంత అభ్యంతరకరమైన రాతలు రావడం పై కూడా జోకులు పేలుతున్నాయి. రాహుల్ గాంధీ కి ఇంచా చిన్న పిల్లల మనతత్వం పోకపోవడం వల్ల ఆయన తన ట్విటర అకౌంట్ పాస్ వర్డ్ ను చోటా భీమ్ అని పెట్టుకున్నాడని దీని వల్లే రాహుల్ అకౌంట్ ను హ్యాకర్లు చాలా సులభంగా హ్యాక్ చేయగలిగారనే జోకులు పేలుతున్నాయి. అయితే అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది. తమ నేతను కించపర్చేందుకు కొంత మంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతోంది. రాహుల్ పై వస్తున్న జోకుల విషయంలో రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనిపై కార్యకరణ కార్యక్రమానికి కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం.