పల్లవి డైరెక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతం

కిడ్నాప్ కు గురైన పల్లవి స్కూల్ డైరెక్టర్ క్షేమంగా బయటపడ్డారు. బుధవారం రాత్రి కుడ్నాప్ కు గురైన పల్లివి స్కూల్ డైరెక్టర్ సుషీల్ కుమార్ ను ఆగంతకులు వదిలి పెట్టారు. కీసర లోని తుర్కపల్లి వద్ద ఆగంతకులు సుషీల్ కుమార్ ను వదిలిపెట్టినట్టారు. డబ్బుల కోసమే తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ గురైన సుషీల్ కుమార్ చెప్పారు. అయితే ఎవరు కిడ్నాప్ చేశారు, ఎంత డబ్బును డిమాండ్ చేశారు. కిడ్నాప్ కు కేవలం డబ్బు వ్యవహారమేనా మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక స్కూల్ డైరెక్టర్ కిడ్నాప్ గురి కావడంతో ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. భారీ ఎత్తున పోలీసులు గ్రూపులుగా విడిపోయి అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించడంతో పాటుగా విషయాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు. మొత్తం మీద పల్లవి స్కూల్ డైరెక్టర్ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం కావడంతో ఇటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.