పంచుకోవడమే పండుగ పరమార్థం…

0
85

హింధూ సంస్కృతిలో ప్రతీ పండక్కీ ఓ నిర్థష్టమైన అర్థం…పరమార్థం దాగి ఉంటుంది. ఆధ్యాత్మిక అంశాలతో పాటుగా గొప్ప సామాజిక అంశాలు కూడా ప్రతీ పండుగలోనూ దాక్కుని ఉంటాయి. మరి సంక్రాంతి అంటే ఏమిటి…ఈ పండుగను ఎందుకు చేసుకోవాలి… ఇందులోని సమాజిక అంశాలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం….
మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ప్రకృతి కనికరిస్తేనే మానవుడి జీవితం ముందుకు సాగుతుంది. సంక్రాతి పండుగ కూడా ప్రకృతితో ముడిపడిందే. ఈ కాలానికి చేలల్లో ఉన్న పంట ఇంటికి చేరుతుంది. పంట సిరులు ఇంటికి చేరిన వేళ రైతుల కళ్లలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. పంట చేతికి వచ్చిన తరుణంలో చేసుకునే సంబరాలే సంక్రాంతి పండుగ.
తనకి ఉన్న సంపదను నలుగురికి పంచుకోవడమే సంక్రాంతి ఉద్దేశం. హరిదాసులు మొదలు గంగిరెద్దుల వాళ్లదాకా. దాసరుల దగ్గరి నుండి విప్రవినోదుల దాకా అందరు కనిపించేది సంక్రాతి పండుగనాడే. వీరితో పాటుగా గ్రామాల్లోని అనేక కులాల వాళ్లు ఆసాముల దగ్గర ధాన్యం కొలిపించుకుని పోతారు. ఒకరిపై ఒకరు ఆధారపడే గ్రామీణ జీవన సౌందర్యానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి.
ఇంటి పెద్దలను తలుచుకోవడం మరో ముఖ్య అంశం. వారిని గుర్తుచేసుకుంటూ తర్పణలు వదిలే ఆచారం ఉంది. మన కోసం ..మన బాగు కోసం తపించిన పెద్దలను తల్చుకోవడమే పెద్ద పండుగ. వ్యవసాయం అంటే అందులో పశువులు కూడా భాగమే. అందుకే కనుమ నాడు పశువులను అందంగా అలంకరించుకుంటారు. తమకోసం ఏడాది మొత్తం చాకిరి చేసిన పశువులను పూజించుకుని తరిస్తారు.
సాధారణంగా ఇంట్లో పెళ్లో పేరంటమో ఉంటే ఇంటిని చక్కగా అలంకరించుకుంటాం. అట్లాంటిది ధాన్యలక్ష్మి వస్తున్నదంటే దానికి ఘన స్వాగతం పలకేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుకుంటాం.
ప్రస్తుతం పండుగ అంటే కోడిపందాలు అనేలాగా తయారయింది. టీవీల పుణ్యమా అని సంక్రాంతి అంటే కోడిపందాలు అనే భావన నాటుకుని పోయింది. గుప్పుమంటున్న మధ్యం మత్తులో కత్తులతో కదం తొక్కే కోళ్ల రక్తాల నడుమ సంక్రాంతి సంబరాలు చిన్నబోతున్నాయి…

Wanna Share it with loved ones?