నా జీవితం… నాఇష్టం…

ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ తో నయనతార పెళ్లి అయిపోయిందని కొందరు… కాదు సహజీవనం చేస్తోందని కొందరు ప్రచారం చేస్తుండడం పై నయన తార మండిపడింది. తన జీవితం తన ఇష్టమని అందులో ఇతరుల జోఖ్యం సహించనని నయన్ చేప్తోంది. తాను పెళ్లి చేసులేదని స్పష్టం చేసిన నయన తారు సహజీవనం వార్తలను కూడా కొట్టి పారేసింది. ఇటువంటి వార్తలను ఎవరు ప్రచారం చేస్తున్నారో  అర్థం కావడం లేదని అయినా నా జీవితం నా ఇష్టం అంటూ నయన తార కోపగించుకుంటోంది.  ముందు హీరో శింబు.. తర్వాత కొరియోగ్రాఫర్-దర్శకుడు-నటుడు ప్రభుదేవా… ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. మొదటి ఇద్దరితో ఆమె పెళ్లి వరకూ వెళ్లి, ఆనక విడిపోయారు. తాజాగా విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణాన్ని మాత్రం పెళ్లి పట్టాలెక్కించా రనిసీక్రెట్‌గా పెళ్లి  తంతు ముగించారని ఇటీవల వార్తలు వచ్చాయి. చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవల నయనతార ఖరీదైన ఇల్లు కొన్నారని అందులో విఘ్నేశ్‌తో సహజీవనం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సన్నిహితుల వద్ద నయన స్పందించినట్టు సమాచారం.