నాయర్ త్రిపుల్ సెంచరీ భారత్ రికార్డు స్కోరు

చెన్నైలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్ లో భారత యువ ఆటగాడు కరుణ్ నాయర్ త్రిపుల్ సెంచరీ చేశాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న నాయర్ 381 బంతుల్లో 32 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 303పరుగులు చేసిన నాటౌట్ గా నిల్చాడు. భారత్ ఆటగాళ్ల పరుగుల వరదతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 759 పరుగుల రికార్డు స్కోర్ ను చేసింది. దీనితో భారత్ కు మొదటి ఇన్నింగ్స్ లో 282 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ లో ఫార్థివ్ పటేల్ 71, అశ్విన్ 67, జడేజా 51 పరుగులతో రాణించారు.