నాకు 37 ఏళ్లు… ఐతే ఏంటి…

తనకు వయసును దాచుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ అంటోంది. పెళ్లై, పిల్లును ఉన్నంత మాత్రనా లేదా వయసు మీద పడినంత మాత్రనే హీరోయిన్ ల కెరీర్ అంతం అయిపోతుందనే భ్రమల్లో నుండి బయటకు రావాల్సిన అవసరం ఉందని విద్యా చెప్తోంది. కహానీ-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విద్యాబాలన్ తన వయసును దాచుకోవాల్సిన అవసరం లేదని తనకు 37 సంవత్సరాలు ఉన్నాయని అంటోంది. పెళ్లైన మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని సినిమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని అంటోంది. కహానీ-2లో దుర్గా రాణిసింగ్ అనే పాత్రలో తాను నటిస్తున్నట్టు విద్యా బాలన్ చెప్పారు. ఇటీవల కాలంలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల సంఖ్య హీరోయిన్ లకు పెరిగిందని ఇది మంచి పరిణామమని ఆమె చెప్పారు.