నాకు తెలిసింది మూడే శఖాలు:బాలయ్య

తనకు తెలిసింది మూడే శకాలని  ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఒకటి శాలివాహన శఖమైతే రెండవది భారత స్వాతంత్రోద్యమ శకమని మూడవది తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయల్లోకి రావడం అని చెప్పారు. తన 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైలర్ ను  కరీంనగర్ లో విడుదల చేసిన బాలకృష్ణ మాట్లాడుతూ శాతకర్ణి గొప్పరాజనీ భారతదేశ గౌప్పతనాన్ని ఇతర దేశాలకు తీసుకుని వెళ్లిన ఘనత ఆయనదేనన్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పాత్రలను గతంలో తన తండ్రి ఎన్టీఆర్ ఎన్నో చేశారని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చారిత్రాత్మక చిత్రాలను చేయడం తనకు గర్వంగా ఉందని చెప్పారు.

శఖ పురుణుడు గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు బాలకృష్ణ చెప్పారు. ఇంతటి మహానుభావుడికి సంబంధించిన చరిత్ర మన దగ్గర పూర్తిగా లేకపోవడం బాధను కలిగించిందని అన్నారు. గొప్ప వ్యక్తులకు చావు పుట్టుకలతో సంబంధం లేదన్నారు.