దొడ్డిదారిన కొత్తనోట్లు

వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి ఎక్కడ కూర్చున్నా ఫరవాలేదు అనే సామెత నిజమవుతోంది. ఒక పక్క సామాన్య జనాలు చిల్లర కోసం నానా అగచాట్లు పడుతుంటే దక్కాల్సిన వారికి మాత్రం కోట్లాది రూపాయలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇళ్లకే చేరుతున్నాయి. బ్యాంకుల నుండి తమ డబ్బును విత్ డ్రా చేసుకోవడం కోసం గంటల కొద్ది సామాన్య ప్రజలు లైన్లలో నిలబడి నానా అగచాట్లు పడుతున్న కోట్లాది రూపాయలు దొడ్డిదారిన చేరాల్సిన వారికి చేరిపోతున్నాయి. ఇందులో కొంత మంది బ్యాంకు , పోస్టాఫీసు సిబ్బంది చేతివాటం కూడా ఉంది. దీనితో సామాన్యులకు కష్టాలు మిగిలుతున్నాయి.

 • దొడ్డిదారిన తరలుతున్న కొత్త నోట్లు
 • కమీషన్ వ్యాపారుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుతున్న కొత్త నోట్లు
 • బ్యాంకు, పోస్టాఫీసు సిబ్బంది చేతివాటం
 • పోస్టాఫీసులపై సీబీఐ దాడులు జరిగినా కనిపించని ప్రభావం
 • 10 నుండి 15 శాతం కమీషన్ తో వ్యాపారుల వద్దకు చేరుతున్న డబ్బు
 • పెద్ద సంఖ్యలో కమీషన్ వ్యాపారం చేస్తున్న ముఠాలు
 • వారి వద్దకు కొత్త డబ్బు ఎట్లా వస్తోంది అన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు
 • ఐటి దాడుల్లోనూ బయటపడుతున్న కొత్తనోట్లు
 • ఇంత పెద్ద మొత్తంలో కొత్తనోట్లు ఎట్లా చేరాయి అన్న దానిపై ఆరా..
 • అవాక్కవుతున్న అధికారులు
 • అవకాశం ఉన్న అన్ని మార్గాల్లోనూ నోట్లును మారుస్తున్న ముఠాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *