దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలి:రాహుల్

ప్రధాని నరేంద్ర మోడీ పేదలపైనే ప్రతాపాన్ని చూపుతున్నారని అడ్డదారుల్లో కోట్లాది రూపాయలు తీసుకువెళ్తున్న బడా వ్యక్తులను ఏమీ చేయలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధక్షుడు రాహుల్ గాంధీ వీమర్శించారు. పెద్ద నోట్లును రద్దు చేసిన తరువాత పేదల బతుకులు దయనీయంగా మారాయని అన్నారు. బ్యాంకుల వద్ద క్యూలలో పేదలు మాత్రమే కనిపిస్తున్నారని ధనవంతులు కనిపించడం లేదని వారికి డబ్బులు అవసరం లేదా అని రాహుల్ ప్రశ్నించారు. ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా పేద ప్రజలు రోడ్డను పడ్డారని అన్నారు.

వ్యవసాయం, వ్యాపారాలు కుంటుపడ్డాయని వీరందరినీ ఇబ్బందుు పెట్టిన ఘనత నరేంద్ర మోడీదేనని ఎద్దేవా చేశారు. పేద ప్రజలు తమ బ్యాంకుల్లో నుండి డబ్బులు తీసుకోవడానికి నానా అగచాట్లు పడుతుంటే కొంత మంది పెద్దల వద్ద మాత్రం కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయని రాహుల్ అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో వారి వద్దకు కొత్త నోట్లు ఏట్లా వస్తున్నయాని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థిక రంగాన్ని మోడీ బ్రష్టు పట్టిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందన్నారు.

నోట్ల రద్దును గురించి ప్రధాన మంత్రి రోజుకో మాట మాట మాట్లాడుతున్నారని ఒకసారి నల్లధనాన్ని వెలికితీయడం కోసమని, మరోసారి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడడం కోసమని , మరో సారి నగదు రహిత సమాజంగా మార్చడానికని మాటమారుస్తున్న మోడీ అసలు పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.